Monday 30 January 2017

Varsham Munduga - Sega

రచయిత - శ్రీ మని
చిత్రం - సెగ


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

కునుకేమొ దరికి రాదు
ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే
కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే
విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

పసి వయసులో నాటిన విత్తులు
మనకన్నా పెరిగెను ఎత్తులు
విరబూసెను పూవులు ఇప్పుడు
కోసిందెరెవప్పటికప్పుడు
నువు తోడై ఉన్న నాడు పలకరించె
దారులన్ని దారులు తప్పుతున్నవే

నా కన్నులు కలలుకు కొలనులు
కన్నీళ్ళతొ జారెను ఎందుకు
నా సంధ్యలొ చల్లని గాలులు
సుడిగాలిగ మారెను ఎందుకు
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం
నరకం లాగ మారెనె
ఈ చిత్రవధ నీకు ఉండద

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు
ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే
కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే
విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

9 comments: