రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం
గా మా నీ గమగస మగస గస నీసానిదమగ
దమగ మగ సరీసానీ
గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ
వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
సాగర సంగమమే ఒక యోగం
నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిరనర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా
అతిథి దేవో భవా అతిథి దేవో భవా
ఎదురాయె గురువైన దైవం
మొదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణై పోయె జీవం
నటరాజ పాదాల తల వాల్చనా
నయనాభిషేకాల తరియించనా
నటరాజ పాదాల తల వాల్చనా
నయనాభిషేకాల తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగా
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా :
నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం
నాస్తి జరా మరణంచ భయం
నాస్తి జరా మరణంచ భయం
In the last line where you have the sloka, it should say, "Naasti keshaam" . Keshaam represents body. It is misspelled in telugu
ReplyDeleteక్లేశం కేశం కాదు klesam not kesan
DeleteKeshaam means hair not body. Hare Krishna. That is Klesham.
DeleteThis comment has been removed by the author.
DeleteIt is "nasti teshaam yasah kaaye" ... (not klesham, but teshaam). Here, "teshaam" means "their" and "yasah" means glory and "kaaye" means "body" (more like "embodiment" in this context) . Together, the entire line means: there is no fear of old-age or death for the embodiment of "their glory". Detailed meaning maybe found here:
Deletehttps://learnsustain.wordpress.com/%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%87-%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%B8%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%8D
What is the meaning of last sloka
ReplyDeletehttps://learnsustain.wordpress.com/%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%87-%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%B8%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%8D
Deleteswaras clarity evvandi
ReplyDeleteIn which raga the song is composed
ReplyDeleteHansanandi
Deleteమోస్ట్ ఎనర్జిటిక్ లిరిక్స్
ReplyDeleteఈ పాట ఎప్పుడు విన్న ఏదో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది
ReplyDelete🥺🤗
ReplyDelete