Saturday, 11 February 2017

Om Namah Sivaya - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


ఓం ఓం ఓం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా
ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై 
పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై 
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై 
స గ మ ద ని స గ ద మ  ద ని  స గ మ గ గ గ స స స ని గ మ ద స ని ద మ గ స
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై 
తాపస మందారా ఆ
నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయా

ఓం ఓం ఓం నమశ్శివాయ 

త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై 
త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆది యోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాసగిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శ్రుతి కలయ
ఓం ఓం ఓం నమశ్శివాయ 
చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా 
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా

7 comments:

  1. Veturi gari ki padabhivandanalu

    ReplyDelete
  2. ఓం నమ:శివాయ

    ReplyDelete
  3. ఈ ఒక్క పాట చాలు, వేటూరి గారికి అద్వైతం ఎంత బాగా తెలుసో చెప్పడానికి

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Great Contribution! Gratitude for thy Comprehension

    Om Namah Shivaya

    🕉️🔱🔯
    3️⃣6️⃣9️⃣
    👁️🙏👁️

    ReplyDelete