రచయిత - వేటూరి
చిత్రం - మాతృదేవోభవ
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాతృ దేవో భవ
పితృ దేవో భవ
అచార్య దేవో భవ
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి
Adbhutam veturi gari rachana.... anirvachaneeyam chitramma gaanam, Madhavi gari natana...,🙏🙏🙏
ReplyDeleteSuper super song hatsoff to chitragariki song compose chesina Venturi garimi paadabivandanaalu
DeleteEe pata chala manchi ga rasaru
ReplyDeleteNaaku ee song ki English translation with meaning kaavali. Dhaya chesi Yevaraina Post cheiyyani
ReplyDeleteVeturi sahityam chitra gari gaanam keeravani sangeetam madhavi natana okadanni minchi inkokati poti padutunnatluga unnayi. Hrudayanni kadilinchesindi ee paata. Chennakesavulu
ReplyDeleteexcellent
ReplyDeleteI love chithra garu🙏💗
ReplyDeleteGreatest
ReplyDeleteVeturi gaaru, m.m keeravani gaaru, k.s chitra gaaru ee paataku jeevan posaru
ReplyDeleteHeart touching song
ReplyDeleteదయార్ద్ర దైవంపై ఆర్ద్ర గీతం , చిత్రమ్మ్మ గాత్రం గేయానికే ప్రాణ ప్రతిష్ట
ReplyDelete