Friday, 31 March 2017

Cheli - Ala Modalaindi

రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం - అలా మొదలైంది


చెలి వినమని చెప్పాలి మనసులో తలపుని
మరి ఇవ్వాలే త్వరపడనా
మరో ముహూర్తం కనబడునా
ఇది ఎపుడో మొదలైందని
అది ఇపుడే తెలిసిందని

తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విస్సుకుంటూ పొమ్మంటుందేమో
మందారపువ్వులా కందిపోయి
చీ అంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే
మరియాదకెంతో హాని
ఇది ఎపుడో మొదలైందని
అది ఇపుడే తెలిసిందని

పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్నానంటు
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగిరానంది
ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని
అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని

No comments:

Post a Comment