Thursday 2 March 2017

Ya Ya - A Aa

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - అ ఆ


రామ్ములగ బుగ్గల వాడా
బురుజుకోట నిబ్బరాల కండలవాడా
రాజాపేట లాకుల కాడా
కలుసుకుంట కాసులపేరు పట్టకరారా
అల్లాబక్షు అత్తరు తెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చా
రంగామెల్లే  రైలు బండీ రయ్యి మంది
పెట్టేబేడా పట్టుకొచ్చా

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
మౌనంగా ధ్యానంలో ఉందీ మాగాణం
చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
కొమ్మ రెమ్మల్ల మైనాల కుక్కూ కుక్కూ
ఇది పల్లెకె తెలిసిన మెలొడీగా 
యా యా యా యా యా యా యా యా
యా యా యా యా యా యా
అయా ముగ్గులూ ముంగిళ్ళు
అయా ప్రేమలూ నట్టిళ్ళూ
అయా చూడగా చాలేనా రెండే కళ్ళు
అయా పువ్వులూ పుప్పొళ్ళు
అయ అయా పంటలూ నూర్పిళ్ళూ
అయా పండగలు తిరనాళ్ళూ
ఈ పచ్చిగాలి జోలలూ మెచ్చనోళ్ళు లేరట
కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
కావిళ్ళు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలిస్యమా
యా యా యా యా యా యా యా యా 
యా యా యా యా యా యా
యా యా యా యా యా యా యా యా 
యా యా యా యా యా యా

కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయె అగుపించరా
కోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది శమించునా
వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట వాలించరా
అల్లరి చేష్టల దండించినా
అక్కున చేరిచి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను చూడగ బిరాన రారా దొరా
కోపాల గోపాల ఆ ఆ ఆ కోపాల గోపాల ఆ ఆ ఆ
కోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయె అగుపించరా

No comments:

Post a Comment