Tuesday 31 January 2017

Thakita Thakita Thadimi - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలల లలలా
ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండి అలను అందియలుగ చేసి

టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తరిగిడతోం తరిగిడతోం తరిగిడతోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన

పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనే తెలుగు పాట
పల్లవించు పద కవితలు పాడి

Monday 30 January 2017

Varsham Munduga - Sega

రచయిత - శ్రీ మని
చిత్రం - సెగ


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

కునుకేమొ దరికి రాదు
ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే
కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే
విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

పసి వయసులో నాటిన విత్తులు
మనకన్నా పెరిగెను ఎత్తులు
విరబూసెను పూవులు ఇప్పుడు
కోసిందెరెవప్పటికప్పుడు
నువు తోడై ఉన్న నాడు పలకరించె
దారులన్ని దారులు తప్పుతున్నవే

నా కన్నులు కలలుకు కొలనులు
కన్నీళ్ళతొ జారెను ఎందుకు
నా సంధ్యలొ చల్లని గాలులు
సుడిగాలిగ మారెను ఎందుకు
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం
నరకం లాగ మారెనె
ఈ చిత్రవధ నీకు ఉండద

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు
ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే
కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే
విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో

Sunday 29 January 2017

Aaradugula Bullet - Atharintiki Daaredi

రచయిత - శ్రీ మని
చిత్రం - అత్తారింటికి దారేది


గగనపు వీది వీడి వలస వెల్లి పొయిన నీలి మబ్బు కొసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే, తన వాసం వనవాసం 

భైరవుడో బార్గవుడో 
భాస్కరుడో మరి రక్కసుడో 
ఊక్కుతీగ లాంటి వంటి నైజం 
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం 
రక్షకుడో దక్షకుడో
పరిక్షలకే సుసిక్షితుడో  
శత్రువంటి లేని వింత యుద్ధం
ఏన్ని గుండెల్లొతు గాయమయిన సిద్ధం   
నడిచొచ్హే నర్థనసౌరీ
పరిగెత్తే పరాక్రమశైలీ
హలాహలం ధరించిన దత్తహృదయుడో   
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు    

గగనపు వీది వీడి వలస వెల్లి పొయిన నీలి మబ్బు కొసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే, తన వాసం వనవాసం   

దివి నుంచి భువిపైకి  
భగ భగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడి వడిగ వడగళ్ళై  
దడ దడమని జారేటి   
కనిపించని జడివానేగా వీడు 
శంకంలో తాగేటి, పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే తాగేసే అశోకుడు వీడురొ
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

తన మొదలే వదులుకొని 
పైకెదిగిన కొమ్మలకి 
చిగురించిన చోటుని చూపిస్తాడు  
తన దిశనే మార్చుకొని 
ఫ్రభవించే సూర్యుడికి 
తన తూరుపు పరిచయమే చేస్తాడు  
రావణుడో రాఘవుడో
మనసుని దోచే మానవుడో 
సైనికుడో శ్రామికుడో 
అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీది వీడి వలస వెల్లి పొయిన నీలి మబ్బు కొసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే, తన వాసం వనవాసం 

Koti Koti - Yeto Velipoindi Manasu

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - ఎటో వెలిపోయింది మనసు


కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా

కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

ఏడు వింతలున్నన్నాళ్లు
నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు
నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు
నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్లు
నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు 
నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లే బంధిస్తుంటా
వంద ఏళ్లిలా

కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్లు
నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు 
నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు
నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు
నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు
జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటా 
ముందు జన్మలా

కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా
కోటి కోటి తారల్లోన 
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

Saturday 28 January 2017

Aura Ammaku Chella - Aapadbhandavudu

రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం - ఆపద్బాంధవుడు


ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల

అమ్మలాల పైడి కొమ్మలాల
ఏడి ఏమయ్యాడె జాడలేడియాల
పోని తందనాల ఆనందలాల

గోవుల్లాల పిల్ల గొవుల్లాల 
గొల్ల భామలాల యాడనుండియాల 
నాటి నందలాల ఆనందలీల

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా 
అంత వింతగాధల్లో ఆనందలాల

నల్లరాతి కండలతో కరుకైనవాడె
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడె
నల్లరాతి కండలతో కరుకైనవాడె ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడె ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాణ పదాలతో  జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా 
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల

ఆనందలాల ఆనందలీల
ఆనందలాల ఆనందలీల

Friday 27 January 2017

Govullu Thellana - Saptapadi

రచయిత - వేటూరి
చిత్రం - సప్తపది


గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన

తెల్లావు  కడుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
ఏమో
తెల్లావు  కడుపుల్లో కర్రావులుండవా
కర్రావు  కడుపున ఎర్రావు పుట్టదా 

గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి  కుంకుమై గోపమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలన అంటే  అందువలన
ఎందువలన అంటే దైవ ఘటన

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
పాపం
అల్లన మోవికి తాకితే గేయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా

ఎందువలన అంటే  అందువలన
ఎందువలన అంటే దైవ ఘటన

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

Repalliya Eda Jalluna - Saptapadi

రచయిత - వేటూరి
చిత్రం - సప్తపది


రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

Thursday 26 January 2017

Aamani Paadave - Geetanjali

రచయిత - వేటూరి
చిత్రం - గీతాంజలి


ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా 
ఆమనీ పాడవే హాయిగా 

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో 

సుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా 
ఆమనీ పాడవే హాయిగా

Wednesday 25 January 2017

Annamayya Jananam - Annamayya

రచయిత - వేటూరి
చిత్రం - అన్నమయ్య


తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్నానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశిస్సులు పొందినదై
శివలోకమున చిద్విలాసమున 
డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్య నాట్యముల
పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర 
మహతీ గానవు మహిమలు తెలిసి
స్థిత హిమకందుర యతిరాట్ స్సభలో 
తప: ఫలమ్ముగ తళుకుమని
ఓం

తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా 
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై 
ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ్య 
అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య 
అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై 
ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య 
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

Tuesday 24 January 2017

Ade Neevu - Abhinandana

రచయిత - ఆత్రేయ
చిత్రం - అభినందన


అదే నీవు అదే నేను 
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను 
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను 
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను 
అదే గీతం పాడనా

కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము

అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేనీ గానము

అదే నీవు అదే నేను 
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా

నిన్నా రేపు సందెల్లో నేడై వుందామన్నావు
నిన్నా రేపు సందెల్లో నేడై వుందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదమన్నావు

అదే బాసగా అదే ఆశగా
ఎన్నీ నాళ్ళీ నిన్న పాటే పాడను

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా

Monday 23 January 2017

Jagamantha Kutumbam - Chakram

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం      - చక్రం


జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలో కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై 
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె 
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది