రచయిత - ఆత్రేయ
చిత్రం - అభినందన
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ఆత్రేయ గారికి నమో వాక్కులు
ReplyDeleteUnforgettable memories Of Movie Songs Abhinandana....
ReplyDelete