Tuesday 28 February 2017

Nee Navvula - Aadi

రచయిత - చంద్రబోస్
చిత్రం - ఆది


నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ 
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ 
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపులు చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ  
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ  
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచే నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకై మొక్కే నాకే ఇవ్వచ్చూ
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ 
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు
నీనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ 
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నా వాకిట ముగ్గులు నీకై నా దోసిట మల్లెలు నీకే
నా పాపిటి వెలుగులు నీకై నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా

Monday 27 February 2017

Emaindi E Vela - Aaduvari Matalaku Ardaale Verule

రచయిత - కులశేఖర్
చిత్రం - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే


ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెల వెల వెల బోయెనే
తన సొగసే తీగ లాగా నా మనసే లాగెనే
అది మొదలూ ఆమెవైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా

ఆమె అందమే చూస్తే మరి లెదులేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింతా
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా
మొదటి సారీ మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా

Allanta Doorana - Aadavari Matalaku Ardaale Verule

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే


అల్లంత దూరా ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలికా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరా ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడూ శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది సుందరి నీడా
ఇందరి చేతులు పంచిన మమతా
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవగా
అందానికే అందమనిపించగా
దిగివచ్చెనో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

తన వయ్యారంతో ఈ చిన్నది 
లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా

అల్లంత దూరా ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా

Sunday 26 February 2017

Mutyala Dharani - 7th Sense

రచయిత - భువన చంద్ర
చిత్రం - 7th సెన్స్


ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ
విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

ఓ అలలా ఓ సుమఝరిలా ఓ
కదులుతున్న నీ కురులందే నే దాగనా
వరించేటి వెన్నెల నీడై పులకించనా
అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా
వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ
విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా
ఓ ఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

కలనైనా ఓ క్షణమైనా
నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం
నిన్నే కోరుకుందే నాలో ఆరాటం
పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా
క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లేదామ్మా
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ
విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

Ellipoke Shyamala - A Aa

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - అ ఆ


నువ్ పక్కనుంటె బాగుంటాదే
నీ పక్కనుంటె బాగుంటాదే
నువ్ కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తిబెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్ తిప్పుకుంట ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకె శ్యామలా
ఎళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా

ఎక్కి ఎక్కి ఏడవలేనే ఎదవ మగ పుటకా
గుండే పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకె శ్యామలా
ఏ ఏళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళి పోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకే శ్యామలా

నరం లేని నాలిక నిన్ను ఎళిపొమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలపడిపోయే
నీ పోష్టరు అడ్డంగా చింపేశాననుకున్నా
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసి పట్టేసి
నీతో పట్టుకుపోమాకే
గెలిచేసి, నన్నొదిలేసి
సీకటైన కోటలాగ  సెయ్యమాకే
నువ్ ఎళ్ళీపోకే శ్యమలా 
నువ్వళ్ళమాకె శ్యామలా
ఏమి బాగ లేదె లోపలా
నువ్ ఎళ్ళిపోకె ఎల్లిపోకె ఎల్లిపోకె శ్యామలా
మనసుకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక
మరిచిపోదమంటె గుర్తుకొస్తున్నదా నిప్పు సురక
ఏమి సెయ్యనోరి సైదులు గుండెలోన గుచ్చిపోయినాది సూదులూ
నానేటి సెయ్యనోరి సైదులు గుండెలోన గుచ్చిపోయినాది సూదులూ
ఎళ్ళిపోకె శ్యమలా
అట్ట ఎళ్ళమాకె శ్యమలా
నువ్వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకే శ్యామలా

Saturday 25 February 2017

Talachi Talachi(Female) - 7/G Brindavan Colony

రచయిత - శివ గణేశ్
చిత్రం - 7/G బృందావన్ కాలని


తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువు వేళ
కాలిపోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా
కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగి పోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని



Kalalu Kane Kaalaalu - 7/G Brindavan Colony

రచయిత - శివ గణేశ్
చిత్రం - 7/G బృందావన్ కాలని


కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం
పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా 
మెలమెల్లగ వినిపించే ఘోషా
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా

తడికాని కాళ్ళతోటి కడలికేది సంబంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారు జాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపం రాకా కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగలము మదికంపం అది తట్టుకోలేం

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా

Friday 24 February 2017

Aho Balu Oho Balu - 100% Love

రచయిత - శ్రీమణి
చిత్రం - 100% లవ్


ఓ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్
టూ బాడ్ ఒంటికేమో బద్దకమిచ్చావ్
ఓ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావ్
టూ బాడ్ మిల్లి గ్రామ్ బ్రెయినే ఇచ్చావ్
ఓ గాడ్ వన్ డే మాచే ఇచ్చావ్
టూ బాడ్ సేమ్ డే ఎగ్సామ్ ఇచ్చావ్
ఓ గాడ్ కొశ్చన్ పేపర్ ఫుల్లుగా ఇచ్చావ్
టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావ్
తల తిప్పలేని అన్నీ అందాల్ని ఇచ్చావ్
తల ఎత్తుకోలేని రిసల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే
ఇది మాచ్ ఫిక్సింగ్ మా ఫెయిలూర్ కి
ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా

మెమరీ కార్డ్ సైజేమో చోటి మెమరీ స్టేటస్ కోటి
మిల్లి గ్రామ్ బ్రెయినయితే ఏంటి మిరాకిల్స్ చేయి దాంతోటి
బాత్రూంలో పాటలకి బదులు ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు
అబ్బాబ్బా ఏం చెప్పాడ్రా
అహో బాలు ఒహో బాలు
అంకెలు మొత్తం వందలు వేలు విడి ర్యాంక్ తోటే మొదలు
అహో బాలు ఒహో బాలు
ఎ టు జడ్ అని చదివే బదులు బి టు యు అంటే చాలు

బల్బుని కనిపెడదాం అనుకున్నామూ
ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము
ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడు
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము
కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేసాడు
ఎట్ లీస్ట్ ఫస్ట్ రాంకు కొడదాం అనుకున్నాము
కాని బాలు గాడు దాని కోసం పుట్టేసాడు
ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా

బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకు కనిపెట్టడా మెడిసిన్
టెలిఫోన్తో స్టాప్ అనుకునుంటే స్టార్ట్ అయ్యేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికీ లేదు టుమారొ
అబ్బాబ్బా ఏం చెప్పాడ్రా
అహో బాలు ఒహో బాలు
బాలుకందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు
అహో బాలు ఒహో బాలు
అముకునెదెప్పుడూ ఇంతే చాలు ఈడు మైండ్ రేస్ లో గుర్రం కాలు

లక్కు ఉన్నోళ్ళకి రాంకులు ఇచ్చావు
నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావు
ఎట్ లీస్ట్ అమ్మాయిలకి అందానిచ్చావు
మమ్మల్నేమో నిండా ముంచావు
బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంటావ్
అవరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంటావ్
మమ్మల్నెమో డి గ్రేడ్ చేస్తావ్
ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా ఊ ఎలా ఎలా ఎలా

హే చెట్టుకి పూత కాయ పండని
మూడు రకాలుగా చూస్తాము
పూతై పూసి కాయై కాసీ పండై తేనే విలువిస్తాం
గ్రేడ్ అంటే ఎ బి సి బళ్ళో
బ్రెయునుని కొలిచే స్టిక్కు
కాంపిటీషన్ లేదంటే రేస్ లో గెలుపుకి ఉందా కిక్
అబ్బాబ్బా ఏం చెప్పాడ్రా
అహో బాలు ఒహో బాలు
నంబర్ వన్ కి రొటీన్ బాలు చదువుకి ప్రొటీన్ బాలు
అహో బాలు ఒహో బాలు
సెట్టిల్డైన సెంటర్ బాలు క్వష్చన్ ఎంతైనా ఆన్సర్ బాలు

బాలు చదివిన బుక్కంటా వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్సంటా వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలు వాడిన పెన్నంటా ఆయుధ పూజలు చేద్దాం
బాలు నడిచిన బాటంటా అందరూ ఫాలో అయిపోదాం

Aa Naluguru - Aa Naluguru

రచయిత - చైతన్య ప్రసాద్
చిత్రం - ఆ నలుగురు


ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ
తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ నీ పరువూ మోసేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్ర్యమూ హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం
నీ వెంట కడకంటా నడిచేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా
విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ
ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

Ninna Leni - 180

రచయిత - వనమాలి
చిత్రం - 180


నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
మోములన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
చిరునవ్వే నాదయ్యేనా
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే

నీలో ఆ గుసగుసలే
ప్రేమే వల్లించేనా
పలుకే అలిసే పెదవే సేద తీరేలా
ఈ రకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి
బ్రతుకున ఓ
రి మ ని ప గ రి
పరమార్దమే
మనసా కూ రి రి గ మ తీరి పద నిస
మనిషిగా
నిలపద
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
మోములన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే

నీతో ఈ పయనాలే
రోజూ కొనసాగేనా
మలుపే తిరిగే పెరిగే బాహు దొరలే
మననే నిలిపే కడకు గమ్యం ఏదైనా
ద ని ద మ గ రి
నిను విడనీ
రి ప మ ని ప గ రి
చిరు సంబరం
మనసా నీ స రి గ తో మ ప ద ని స
కదిలితే
చాలదా
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
మోములన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
చిరునవ్వే చిరునవ్వే నాదయ్యేనా

Thursday 23 February 2017

Jabiliki Vennalaki(Female) - Chanti

రచయిత - సాహితి
చిత్రం - చంటి


జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే
కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే
రాగములు తాళములు నాకసలే రావులే
పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

Jabiliki Vennalaki(Male) - Chanti

రచయిత - సాహితి
చిత్రం - చంటి


జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

కన్న తల్లి ప్రేమ కన్న అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి
కన్న తల్లి ప్రేమ కన్న అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి
దేవతంటి అమ్మ నీవే కోవెలే బిడ్డలకి
చమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించె లాలనెంతో తీయన
మంచుకన్న చల్లనైన మల్లెకన్న తెల్లనైన అమ్మ పాటె పాడుకోనా
మల్లెకన్న తీయనైన అమ్మ పాటే పాడుకోనా

Ye Devi Varamu - Amrutha

రచయిత - వేటూరి
చిత్రం - అమృత


ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే
ఆయువడిగినది నీ నీడే 
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణవాయువే ఐనావే
మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

ఎదకు సొంతం లే
ఎదురు మాటవులే
కలికి వెన్నెలవే
కడుపు కోతవులే
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
మరణ జనన వలయం నీవేలే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

సిరుల దీపం నీవే 
కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగనీ కంటి నీడనీ
ఇంటి వెలుగనీ కంటి నీడనీ
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నే నెత్తిపెంచినా శోకంలా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే 
ఆయువడిగినది నీ నీడే 
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణవాయువే ఐనావే
మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

Wednesday 22 February 2017

Jabili Kosam(Female) - Manchi Manasulu

రచయిత - ఆత్రేయ
చిత్రం - మంచి మనసులు


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటైనె
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనె
కాదన్ననాడు నేనే లేను
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటైనె
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటైనె
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

Jabili Kosam(Male) - Manchi Manasulu

రచయిత - ఆత్రేయ
చిత్రం - మంచి మనసులు


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రుతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీ కంపినాను రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటీ అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

Tuesday 21 February 2017

Aakaasam - Ye Maya Chesave

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - ఏ మాయ చేసావె


ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకి రాదే
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించెవెలా
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించెవెలా

ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే

ప్రాణం చెప్పే మాటే వింటే
అన్నీ నీకే అర్దం కావా
ఇష్టం ఉన్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా
ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకి రాదే
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించెవెలా
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించెవెలా

Monday 20 February 2017

Venuvai Vachanu - Matrudevobhava

రచయిత - వేటూరి
చిత్రం - మాతృదేవోభవ


వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
అచార్య దేవో భవ

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి

Sunday 19 February 2017

OK Anesa - Kotha Bangaru Lokam

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - కొత్త బంగారు లోకం


ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస
ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభస

పరిగెడదాం పదవే చెలీ
ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ 
ఎక్కడున్నా
ఎగిరెళదాం ఇలనొదిలి
నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని
ఎవరాపినా
మరోసారి అను ఆ మాట
మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం
ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో జన్మ ముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పిలిచినదా చిలిపి కల
వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా
పరుగుతీశా
వదిలినదా బిడియమిలా
ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల
ఏటో చూశా
భలేగుందిలే నీ ధీమా
ఫలిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా
పరదా విడిరా సరదా పడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Manasa Veena - Hrudayanjali

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - హృదయాంజలి


మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాల పానుపుపైన
అమ్మై నేల జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన
అమ్మై నేల జోకొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం

పున్నమి నదిలో విహరించాలి
పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి
తొలకరి జల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలి
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్ఛకందిచాలి నా హృదయాంజలి
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం

వాగునా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం వరదాయే
నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం
వాగునా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం వరదాయే
నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం

ఊహకు నీవే ఊపిరిపోసి
చూపవె దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెళ వేసి
కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి

మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాల పానుపుపైన
అమ్మై నేల జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన
అమ్మై నేల జోకొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం

వాగునా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం వరదాయే
నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం
వాగునా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం వరదాయే
నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం

Sunday 12 February 2017

Naalo Nenena - Baanam

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - బాణం


నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటి ఇలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదేమాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

అవును కాదు తడబాటుని అంతో ఇంతో గడి దాటని
విడి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది ఇది ఇదేమాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందని
నాలో సగమై కలిసిందని
మెలకువ కాని హృదయాన్ని
చిగురైపోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్నా నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపోయాయి ఇలా
మనమే సాక్షం మాటే మంత్రం ప్రేమే బంధం
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

Saturday 11 February 2017

Om Namah Sivaya - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


ఓం ఓం ఓం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా
ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై 
పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై 
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై 
స గ మ ద ని స గ ద మ  ద ని  స గ మ గ గ గ స స స ని గ మ ద స ని ద మ గ స
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై 
తాపస మందారా ఆ
నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయా

ఓం ఓం ఓం నమశ్శివాయ 

త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై 
త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆది యోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాసగిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శ్రుతి కలయ
ఓం ఓం ఓం నమశ్శివాయ 
చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా 
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా

Ve Vela Gopammala - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


వే వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
ఆ ఆహాహా వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్నతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే
మోహనాలు వేణువూదే మోహనాంగుడితడేనే
మోహనాలు వేణువూదే మోహనాంగుడితడేనే
ఆ చీరలన్ని దోచి దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబార మేగినాడే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
ఆ ఆ నీలమై నిఖిలమై కాలమై నిలిచినాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు గోవిందుడే

Vedam Anuvanuvuna Naadam - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


గా మా నీ గమగస మగస గస నీసానిదమగ
దమగ మగ సరీసానీ
గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ
వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం

సాగర సంగమమే ఒక యోగం
నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిరనర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం

మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా
అతిథి దేవో భవా అతిథి దేవో భవా

ఎదురాయె గురువైన దైవం
మొదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణై పోయె జీవం
నటరాజ పాదాల తల వాల్చనా
నయనాభిషేకాల తరియించనా
నటరాజ పాదాల తల వాల్చనా
నయనాభిషేకాల తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగా
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై

జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా :
నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం
నాస్తి జరా మరణంచ భయం
నాస్తి జరా మరణంచ భయం