Saturday 28 January 2017

Aura Ammaku Chella - Aapadbhandavudu

రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం - ఆపద్బాంధవుడు


ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల

అమ్మలాల పైడి కొమ్మలాల
ఏడి ఏమయ్యాడె జాడలేడియాల
పోని తందనాల ఆనందలాల

గోవుల్లాల పిల్ల గొవుల్లాల 
గొల్ల భామలాల యాడనుండియాల 
నాటి నందలాల ఆనందలీల

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా 
అంత వింతగాధల్లో ఆనందలాల

నల్లరాతి కండలతో కరుకైనవాడె
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడె
నల్లరాతి కండలతో కరుకైనవాడె ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడె ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాణ పదాలతో  జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా 
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల

ఆనందలాల ఆనందలీల
ఆనందలాల ఆనందలీల

1 comment:

  1. చతుర్వేదాలు సృష్టించిన బ్రహ్మ సైతం వర్ణించటానికి సాధ్యం కానివి కృష్ణుడి లీలలు. భారత భాగవతా కధా సారాన్ని ఒక్క పాటలో సినీ గీతం ద్వార జనమాధ్యమంలోకి చొప్పించి మెప్పించిన ఘనత మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది.

    ReplyDelete