Friday 31 March 2017

Cheli - Ala Modalaindi

రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం - అలా మొదలైంది


చెలి వినమని చెప్పాలి మనసులో తలపుని
మరి ఇవ్వాలే త్వరపడనా
మరో ముహూర్తం కనబడునా
ఇది ఎపుడో మొదలైందని
అది ఇపుడే తెలిసిందని

తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విస్సుకుంటూ పొమ్మంటుందేమో
మందారపువ్వులా కందిపోయి
చీ అంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే
మరియాదకెంతో హాని
ఇది ఎపుడో మొదలైందని
అది ఇపుడే తెలిసిందని

పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్నానంటు
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగిరానంది
ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని
అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని

Innallu - Ala Modalaindi

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - అలా మొదలైంది


ఇన్నాళ్ళూ నా కళ్ళు
గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు
గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరి దాకా చెలిమి పంచే చిలిపి తనమే నీవని
మనసుదాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో
ఇలా

ఎవరు చేరి తీర్చగలరు మనసులో ఈ లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉంది పోనా నేను ఇక పైనా
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్ని నాళ్ళైనా
ఇలా

Thursday 30 March 2017

Edo Anukunte - Ala Modalaindi

రచయిత - లక్ష్మీ బూపాల్
చిత్రం - అలా మొదలైంది


ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకే వదిలేద్దాం కథను కంచికే
అసలీ ప్రేమ గీమ ఎందుకు టెల్ మి వై
ఎవరిష్టం వాళ్లది మనకెందుకు వొదిలై
యేయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే

ప్రేమించిన పెళ్ళెందుకు వైఫ్ ఒక్కటే తోడెందుకు
మగవాళ్ళని టైం పాస్ అని
అనుకుంటు వెంట తిరగని మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు టెల్ మి వై
అది బుర్రే లేని వాళ్ళకి వొదిలేసెయ్
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు టెల్ మి వై

నువ్వక్కడే పుట్టావురా నువ్వక్కడే పోతావురా
ఆ మధ్యలో బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు
సూసైడ్ నేరం వొద్దు మనకి
మరి లైఫు గీఫు ఎందుకు టెల్ మి వై
నువ్వు మళ్ళి మళ్ళి మొదలెట్టకు వొదిలై
ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై

Ammammo - Ala Modalaindi

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - అలా మొదలైంది


అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వలా
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే అలా
కవ్వించే నవ్వే పువ్వై పూసిన
గుండెల్లో ముళ్ళై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన
చేతల్లో అన్నీ అందునా
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వలా

ఆహా ఏమి కన్నుల్లు
ఓహో ఏమి చూపులు
అవి కావా మా ఆస్తులు
ప్రేమించకముందరే
ఈ తియ్యని కవితలు
తరువాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ
ఆపైన ఐ యామ్ సారీ అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ
సింపుల్ గా నో అందురు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వలా

కన్నీటి బాణమే వేసేటి విద్యలో 
ముందుంది మీరే కాదా
మౌనాన్నే కంచేగా మలిచేటి కోర్సులో 
డిస్టింక్షన్ మీదే కాదా
కన్నీరైనా మౌనమైనా
చెప్పేది నిజమేలే ప్రతీరోజు
అంతే కానీ అర చేతిలో 
ఆకాశం చూపించవు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వలా
కవ్వించే నవ్వే పువ్వై పూసిన 
గుండెల్లో ముళ్ళై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన
చేతల్లో అన్నీ అందునా

Sande Podulla Kada - Abhilasha

రచయిత - వేటూరి, ఆత్రేయ
చిత్రం - అభిలాష


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందెగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళూ తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమవుతుందో
ఎవరికిస్తుందో ఏమవుతుందో
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడేక్కిపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండాకోన జలకాలాడేవేళ
కొమ్మా రెమ్మా చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టేవేళ
పిల్ల పాప నిదరే పోయేవేళ
కలలే కౌగిలే కన్నులు దాటలా
ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాలా
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాలా
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందెగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడేక్కిపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

మల్లెజాజి మత్తు జల్లే వేళ
పిల్లగాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగేవేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నెల గుమ్మ చీకటి గవ్వలాడాలా
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళూ తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమవుతుందో
ఎవరికిస్తుందో ఏమవుతుందో
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

Wednesday 29 March 2017

Lalita Priya Kamalam - Rudraveena

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - రుద్రవీణ


లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవి కిరణం మెరిసినది
అమృత కలశముగ ప్రతి నిమిషం
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది

రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినది
మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
లలిత ప్రియ కమలం విరిసినది

Ye Kulamu - Saptapadi

రచయిత - వేటూరి
చిత్రం - సప్తపది


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సౌతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సౌతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది

ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది

Tuesday 28 March 2017

O My Friend - Happy Days

రచయిత - వనమాలి
చిత్రం - హ్యాపి డేస్


పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోన నేను లేనా
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేగా
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది
జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది
మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే
మోమాటాలే లేని కళే జాలువారే
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీదే
ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

Monday 27 March 2017

Malli Puttani - Vedam

రచయిత - కీరవాణి
చిత్రం - వేదం


ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మిణుకు మిణుకు మంటోంది
మనిషిగ బ్రతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణంల్లో ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

One Way One Way - Gamyam

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - గమ్యం


వన్ వే వన్ వే జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపోయే ప్రయాణం
రన్ వే లాటిది కాదుగా ఇది
ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం
ఈ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులెన్నో
తీయ తీయగానె నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలని సృష్టిలో రహస్యం
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలని సృష్టిలో రహస్యం
వన్ వే వన్ వే జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపోయే ప్రయాణం

జగమే ఒక మాయ బతుకే ఒక మాయ
అది అన్నది ఎవరో అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బతికే ఆ మాయలో హాయిలేగా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీ
బదులు ఎవ్వరూ చెప్పలేరుగా అందుకే నేటి రోజే నీది
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నదీ యవ్వనం
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నదీ యవ్వనం

తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు
తను వెళ్ళే చోటే తెలుసా మరి మనకు
నిన్న అన్నదిక రాదు గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు కలలాంటిదే కదా మనకు
ఎన్ని వేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటక రంగం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటె నీ సొంతమే సమస్తం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటె నీ సొంతమే సమస్తం

వన్ వే వన్ వే జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపోయే ప్రయాణం
ఈ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులెన్నో
తీయ తీయగానె నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలని సృష్టిలో రహస్యం
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలని సృష్టిలో రహస్యం

Saturday 25 March 2017

Shruti Neevu - Swati Kiranam

రచయిత - సి.నారాయణ రెడ్డి
చిత్రం - స్వాతి కిరణం


శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపదము
నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

Friday 24 March 2017

E Divilo - Kanne Vayasu

రచయిత - దాశరథి
చిత్రం - కన్నె వయసు


ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

Thursday 23 March 2017

Srirastu Subhamastu - Pelli Pustakam

రచయిత - ఆరుద్ర
చిత్రం - పెళ్ళి పుస్తకం


శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

Wednesday 22 March 2017

Yelo Yedarilo - Kaatamrayudu

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - కాటమరాయుడు


యేలో యెడారిలో వానా
గాల్లో గులాబి పూసేనా
గుబురు మీసం మెలేస్తున్నా
గుండె పాపం ఎలా ఉందో
బైటికి బైటికి ఆతడు చూపించే దీమా
లోపల లోతున అంతగ ఉంతుందా నిజమా
చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలికపడితె
నిలబడమిక మనుషుల తరమ
యెన్నాళ్ళో ఎమిటో యెన్నళ్ళీ బడాయితో
ఎం చేస్తాడో మనోడు
మారారే వీరులె మారారె మహర్షులె
మారేనా ఈ మగాడు

యేలో యెడారిలో వానా
గాల్లో గులాబి పూసేనా
గుబురు మీసం మెలేస్తున్నా
గుండె పాపం ఎలా ఉందో
సైగతో సైన్యం నడిపించే వాడిపై
సిగ్గొచ్చివాలెనో లమ్మో
బల్లెం బాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగొ ఏమో
సవాలే అయ్యొ అయ్యొ ఇదేం సవారీ
హొయ్యారే అయోమయం కదా దారి
వలపు మలుపు తిరిగినపుడు సొగసు మడుగు యెదురుపడితే
కదలడమిక రథముల తరమా
యెన్నాళ్ళో ఎమిటో యెన్నళ్ళీ బడాయితో
ఎం చేస్తాడో మనోడు
మారారే వీరులు మారారె మహర్షులు
మారేనా ఈ మగాడు

Mellaga Tellarindoy - Shatamaanam Bhavati

రచయిత - శ్రీమని
చిత్రం - శతమానం భవతి


మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచేసిందొయ్ ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బవులలో గల గల
చెరువులో బాతుల ఈ తల తల
చేదుగ ఉన్నవే పనునమిలే వేల
చుట్ట పొగ మంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసార మనతల్లి పండించి అందించు హృదయంలా
చలిమంటలు ఆరేల
గుడి గంటలు మొగేలా సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేల
నవ్వులు తెచ్చే వేల స్వాగతాలవిగో కనవేల

పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువు తలచి
కలమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి
వొదట అందరి దేవుడిగంటా
మొదటి బహుమతి పొందిన పాట
రాయిలాలకు తహ తహలాడిన పసి తనమే గురుతొస్తుందా
ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఊయ్యల
ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట
వెంగల్లే మిగలాల నన్నెవరు వెతికే వీల్లేక

కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయెల్లే
పూల చెట్టుకి ఉందో బాష
అలల మెట్టుకి ఉందో బాష
అర్థమవ్వని వాళే లేరే
అందం మటాదే బాష
పలకరింపే పులకరింపై పిలుపినిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన బాష
మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనెవాలే లేరెవరు

Monday 20 March 2017

Bommani Geeste - Bommarillu

రచయిత - బాస్కర బట్ల
చిత్రం - బొమ్మరిల్లు


బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది
సరసాలాడే వయసొచ్చి౦ది
సరదా పడితే తప్పేము౦ది
ఇవ్వాలనే నాకూ ఉ౦ది
కానీ సిగ్గే నన్ను ఆపి౦ది
దానికి సమయ౦ వేరే ఉ౦ద౦ది

చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపోమ౦ది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి
శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి
పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా
అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద
ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది
నీ వైపే నన్నే లాగి౦ది

అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది
పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది
తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది
మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి
నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది
నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది

Sunday 19 March 2017

Mira Mira - Kaatamaraayudu

రచయిత - రామ జోగయ్య శాస్త్రి
చిత్రం - కాటమరాయుడు


రాయుడో
నాయకుదై నడిపించేవాడు
సేవకుడై నడుమొంచేవాడు
అందరికోసం అడుగేసాడు రాయుడో రాయుడో
మిరా మిరా మీసం
మిరా మిరా మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
కర కరా కండల రోషం
పోటెతుతాది జనం కోసం
మండే ఆవెశం వీడుండె నివాసం
వీడొ నేలబారు నడిచె నిండైన ఆకాశం
అసలు సిసలు చురుకు సరుకు అనువనువున సెగ రగిలేలా
సూరీడల్లె హె సూరీడల్లె వచ్చాడు మన అందరి కాటమరాయుడు
పంచె కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు
మిరా మిరా మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
రాయుడో

ఒకడే వీడు రక రకముల వాడు
ఏ రంగు కల్లకు ఆ రంగై ఉంతాడు
రెపరెపలాడె జెండాల పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల పైనే ఉంతాడు
చిగురు వగరు తగిన పొగరు కలగలసిన ఖడ్గం వీడై
హే సూరీడల్లె వచ్చాడు మన అందరి కాటమరాయుడు
అమ్మ తోడు మా చెడ్డ మంచోడీ కాటమరాయుడు

అసలు సిసలు చురుకు సరుకు అనువనువున సెగ రెగిలేలా
సూరీడల్లె హె సూరీడల్లె వచ్చాడు మన అందరి కాటమరాయుడు
పంచె కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు
రాయుడో

Uppenantha - Arya 2

రచయిత - బాలాజి
చిత్రం - ఆర్య 2


ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకోస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
వెంట పడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటా ఆయువే చెలి
గుచ్చుకోకు ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీపలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

Friday 17 March 2017

My Love is Gone - Arya 2

రచయిత - చంద్రబోస్
చిత్రం - ఆర్య 2


మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పొయే లడికీ పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంతొ బాగుందే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంతొ బాగుందే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

హానెస్టు గుండే పనిలేదే ద బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మార్చే పనిలేదే
కేరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్ తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు
ఇళ్ళలోన మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు
హిస్టరీలోన వెలుగుతాడే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

Thursday 16 March 2017

Feel My Love - Arya

రచయిత - చంద్రబోస్
చిత్రం - ఆర్య


నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటీ తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించీ కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెలుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్

Wednesday 15 March 2017

Kopama Napaina - Varsham

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - వర్షం


కోపమా నాపైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగవే ఇటుపైనా
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన
మన దారులు ఎప్పటికైనా కలిసేనా

కస్సుమని కారంగా కసిరినది చాలింక
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా
కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువు గొడుగును ఎగరేస్తావే జడివానా
కోపమా నాపైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా

తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగదుగనుక
సులువుగా నీలాగా మరచిపోలేదింకా
మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా
కోపమా నాపైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా

Tuesday 14 March 2017

Kallaloki - Nuvve Kavali

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - నువ్వే కావాలి


కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్నామొన్నలనీ నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

Monday 13 March 2017

Nenu Nenuga Lene - Manmadhudu

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - మన్మధుడు


నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

Sunday 12 March 2017

Nenani Neevani - Kotha Bangaru Lokam

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - కొత్త బంగారు లోకం


నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

పదము నాది పరుగు నీది
రథము వేయరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

Friday 10 March 2017

Swapna Venuvedo - Ravoyi Chandamama

రచయిత - వేటూరి
చిత్రం - రావోయి చందమామ


స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

నీదే ప్రాణం నీవే సర్వం
నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు
హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా

నాలో మోహం రేగే దాహం
దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం
రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

Rama Chakkani Sita - Godavari

రచయిత - వేటూరి
చిత్రం - గోదావరి


నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవrO మొగుడంట
రామచక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
రామచక్కని సీతకి
ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవrO మొగుడంట
రామచక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

Uppongele Godavari - Godavari

రచయిత - వేటూరి
చిత్రం - గోదావరి


షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి