Tuesday 2 May 2017

Enduko - Gopala Gopala

రచయిత - చంద్రబోస్
చిత్రం - గోపాల గోపాల


పిల్లి మనకి ఎదురు పడితె
పనులు ఏవి జరగవంట
మనం పిల్లికెదురు పడితె
కర్మ కాలి చచ్చునంట
బల్లి పలుకు సత్యమంట
బల్లి పడితె దోషమంట
నక్క తోక లక్కు అంట
నక్క అరుపు మ్రుత్యువంట
ఎందు కెందు కెందు కెందు కెందు కెందు కెందు కెందుకో

ఎందుకో ఎందుకో
రెండు కాళ్ళు మనకి ముఖ్యమంటు
కుడికాలు ముందు అంటు
మూఢ నమ్మకాలు ఎందుకో
ఎందుకో ఎందుకో
జీవ రాసులన్ని దైవమంటు
జంతు బలులు ఇంక ఎందుకో
నీలోన ధైర్యముండగా
దారాలు ఎందుకో
నీ ఆత్మ శక్తి ఉండగా
తాయెత్తులెందుకో
చేతలే చేయకా
చేతికే రంగు రాళ్ళు ఉంగరాలు ఎందుకో

పేరుకేమొ మంగళవారం
పనులకేమొ అమంగళం
శని వున్న శనివారం
జరుపుతాము శుభకార్యం
బండిలోన వందలాది పరికరాలు ఉన్నగాని
ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం
ఎందు ఎందు ఎందు ఎందు కెందుకో
ఎందుకో ఎందుకో
భూమి బంతి లాగ తిరుగుతుంటె
దిక్కులన్ని మారుతుంటె
వాస్తు నమ్మకాలు ఎందుకో
ఎందుకో ఎందుకో
నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటె
దిష్టి బొమ్మలింక ఎందుకో
శూలాల్ని నోటి లోపల గుచ్చేది ఎందుకో
పాలన్ని పుట్ట లోపల పోసేది ఎందుకో
సూటిగా ఎప్పుడూ నడవకా
ఇంక నిప్పు లోన నడక ఎందుకో

No comments:

Post a Comment