Tuesday 2 May 2017

Mamatala Talli - Bahubali

రచయిత - శివ శక్తిదత్త
చిత్రం - బాహుబలి


మమతల తల్లి
ఒడి బాహుబలి
లాలన తేలి
శతధావరలీ
ఎదలో ఒక పాల్కడలి
మథనం జరిగే స్థలీ

మాహిష్మతి వర క్షాత్ర కులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణ తంత్ర కళా కుశలీ
ఎదలో ఒక పాల్కడలీ 
మథనం జరిగే స్థలీ

లేచిందా ఖండించే ఖడ్గం
దూసిందా ఛేదించే బాణం
చెదరందీ ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
భల్లా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణ రంగం నిరతం
జననీ హృదయం 
ఎదలో ఒక పాల్కడలి
మథనం జరిగే స్థలీ

No comments:

Post a Comment