Tuesday 2 May 2017

Bhaje Bhaje - Gopala Gopala

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - గోపాల గోపాల


అలారే అలా ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా ఆయ నందలాల
ఆడలా ఈలేసాడో కోలాటాల గోల గోల

దూరంగా రంగా దొంగా దాకోకోయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల
మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
దూరంగా రంగా దొంగా దాకోకోయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల

భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రధం తోలి నీతిని గెలిపించాడు
నల్లని రంగున్నోడు
తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు
అందరికీ ఐనోడు
మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడై ఉంటాడు
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే

No comments:

Post a Comment