Monday 6 March 2017

Himaseemallo - Annayya

రచయిత - వేటూరి
చిత్రం - అన్నయ్య


హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో

సోసో కాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వావా అంటే వందనమా అభివందనమా
వయసంతా నందనమా
మొహమాటమైనా నవ మోహనం
చెలగాటమైనా తొలి సంగమం
మది వదిలే హిమ మహిమ
అది అడిగే మగతనమా నీదే భామ
పడుచు పంచదార చిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో

మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి
సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవి కలనే రచన సుమా
సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే

5 comments: