Thursday 2 March 2017

Jaanavule - Aditya 369

రచయిత - వేటూరి
చిత్రం - ఆదిత్య 369


నెర జాణవులే వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుస గుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో

మోమటు దాచీ మురిపెము పెంచే లాహిరిలో
అహహహహ ఒహోహూహొహొహూ
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా
జాణవులే వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలోగుస గుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో

చీకటి కోపం చెలిమికి లాభం
కౌగిలిలో
అహహహహ ఒహోహూహొహొహూ
వెన్నెల తాపం వయసుకు ప్రాణం
ఈ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాళీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా
జాణవులే వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహాహా
జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలోగుస గుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే ఆహాహా వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో

No comments:

Post a Comment