Thursday 9 March 2017

Niluvaddam - Nuvvostanante Nenoddantana

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా


నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా

ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా

ఇది వరకు ఎద లయకు
ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం
మనచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం
నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

No comments:

Post a Comment