Sunday 5 March 2017

Udayinchina - Kalusukovalani

రచయిత - దేవి శ్రీ ప్రసాద్
చిత్రం - కలుసుకోవాలని


హే ఉదయించిన సూర్యుడినడిగ
కనిపించని దేవుడినడిగ
నా గుండెలొ నీ గుడినడిగ నువ్వెక్కడ అని
చలి పెంచిన చీకటినడిగ
చిగురించిన చంద్రుడినడిగ
విరబూసిన వెన్నెలనడిగ నువ్వెక్కడ అని
చిక్కవే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

మనసు అంత నీ రూపం
నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసిన నిమిషం
అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం
ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే
నన్ను తాకేనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావె నన్ను చేరవే
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావె నన్ను చేరవె
హే ఉదయించిన సూర్యుడినడిగ
కనిపించని దేవుడినడిగ
నా గుండెలొ నీ గుడినడిగ నువ్వెక్కడ అని
చలి పెంచిన చీకటినడిగ
చిగురించిన చంద్రుడినడిగ
విరబూసిన వెన్నెలనడిగ నువ్వెక్కడ అని

నువ్వు లేక చిరుగాలి
నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతోంది
కాస్త దూరమే కాద
మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకొంది
ఏమి మాయవొ ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేక నే లేనేలేనని నీకు తెలుపని
హే ఉదయించిన సూర్యుడినడిగ
కనిపించని దేవుడినడిగ
నా గుండెలొ నీ గుడినడిగ నువ్వెక్కడ అని
చలి పెంచిన చీకటినడిగ
చిగురించిన చంద్రుడినడిగ
విరబూసిన వెన్నెలనడిగ నువ్వెక్కడ అని
చిక్కవే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

No comments:

Post a Comment