Sunday 2 April 2017

Jyo Achyutananda - Jyo Achyutananda

రచయిత - భాస్కర బట్ల
చిత్రం - జ్యో అచ్యుతానంద


ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ
ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ
eడారి దారిలో సుమాలు పూసినట్టు
ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో పదాలు దాచినట్టు
మహత్తుగున్నదీ ఇదీ
జో అచ్యుతానంద జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జో అచ్యుతానంద

ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడం ఎలా ఇదీ
గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ
ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా గుండెల్లో గుచ్చుకుంటోందీ
స్వరాల వీణలే చిరాకు పాట లాగ
చెవుllO గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ
సహించలేనిదీ ఇదీ
జో అచ్యుతానంద జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జో అచ్యుతానంద

No comments:

Post a Comment