Saturday 22 April 2017

Ukku Naram - Guru

రచయిత - రామ జోగయ్య శాస్త్రి
చిత్రం - గురు


నీకేమి తక్కువ
నిన్నే నువ్వు గుర్తించవ
నీలోనె ఉంది చూడు ఉక్కు నరం
నువ్వెంతొ చూపించవ
నిన్నే నువ్వు గెలిపించవా
నీకే తెలియని నీలో సత్తా
ఊక్కు నరం
ఊక్కు నరం ఊక్కు నరం
ఊక్కు నరం ఊక్కు నరం
అమ్మ నాన్న పుడుతూనె పెట్టారు పేరు
అందర్లాగ నీకోటి
రంగుల్లోన వెలిగేలా 
ఆ పేరు నేడు సాధించాలి ఎదోటి
గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం
కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం
స్వాగతమంటూ పిలిచింది నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కు నరం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు దైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం

నీలో బలం ఇంతేనని గీతల్లోన ఒదగకు
ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు
నొప్పి లేని పోరాటం ఏ గొప్పా ఇవ్వదులే
నిప్పుల నడకలు తప్పవులే
గమ్యం చేరే దారుల్లో గాయాలన్నీ మామూలే
ప్రతి ఆట పోరాటమంటూ పట్టు బిగించు
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు దైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం

ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం
ఏనాడు తలొంచదే

No comments:

Post a Comment