Thursday 9 February 2017

E Kshanam - Ela Chepanu

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - ఎలా చెప్పను


ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ

ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్న నీవు వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళి నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ

రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకుని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

No comments:

Post a Comment