Thursday 2 February 2017

Aunanna Kaadanna - Leader

రచయిత - వేటూరి
చిత్రం - లీడర్


ఔననా కాదనా నాదనా
లేదనా రాదనా వేదనా
మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
అవుననా కాదనా రాదనా
లెదనా రాదనా వెదనా
ఔననా కాదనా నాదనా
లేదనా రాదనా వేదనా

తార తార దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేల ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది తొలి చూపే కలిసింది
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది తొలి చూపే కలిసింది
ఇందుకేనా ప్రియా ఇందుకేనా
ఔననా కాదనా నాదనా
లేదనా రాదనా వేదనా

ఆశలన్ని మాసిపోయి ఆమనె ఆహ్వానించె
శ్వాసలేలె బాసలన్ని బాధలైపోయేనా
పూలజడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీలా రక్తధారా బాధలైపోయేనా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది
ఇందుకేనా ప్రియా ఇందుకేనా
ఔననా కాదనా నాదనా
లేదనా రాదనా వేదనా

No comments:

Post a Comment