Sunday 5 February 2017

Hare Rama - Okkadu

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - ఒక్కడు


గోవింద బోలోహరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృఇష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

చార్మినార్ చాటు కధకి తెలియదీ నిత్య కలహం
భాగ్యమతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

ఓం సహనాభవతు సహనోగుణౌతు సహవీర్యం కరవా వహైః
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహైః

పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పద పదపని
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా

కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృఇష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

No comments:

Post a Comment