Sunday 26 February 2017

Ellipoke Shyamala - A Aa

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - అ ఆ


నువ్ పక్కనుంటె బాగుంటాదే
నీ పక్కనుంటె బాగుంటాదే
నువ్ కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తిబెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్ తిప్పుకుంట ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకె శ్యామలా
ఎళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా

ఎక్కి ఎక్కి ఏడవలేనే ఎదవ మగ పుటకా
గుండే పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకె శ్యామలా
ఏ ఏళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళి పోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకే శ్యామలా

నరం లేని నాలిక నిన్ను ఎళిపొమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలపడిపోయే
నీ పోష్టరు అడ్డంగా చింపేశాననుకున్నా
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసి పట్టేసి
నీతో పట్టుకుపోమాకే
గెలిచేసి, నన్నొదిలేసి
సీకటైన కోటలాగ  సెయ్యమాకే
నువ్ ఎళ్ళీపోకే శ్యమలా 
నువ్వళ్ళమాకె శ్యామలా
ఏమి బాగ లేదె లోపలా
నువ్ ఎళ్ళిపోకె ఎల్లిపోకె ఎల్లిపోకె శ్యామలా
మనసుకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక
మరిచిపోదమంటె గుర్తుకొస్తున్నదా నిప్పు సురక
ఏమి సెయ్యనోరి సైదులు గుండెలోన గుచ్చిపోయినాది సూదులూ
నానేటి సెయ్యనోరి సైదులు గుండెలోన గుచ్చిపోయినాది సూదులూ
ఎళ్ళిపోకె శ్యమలా
అట్ట ఎళ్ళమాకె శ్యమలా
నువ్వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకే శ్యామలా

No comments:

Post a Comment