Saturday 11 February 2017

Ve Vela Gopammala - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


వే వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
ఆ ఆహాహా వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్నతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే
మోహనాలు వేణువూదే మోహనాంగుడితడేనే
మోహనాలు వేణువూదే మోహనాంగుడితడేనే
ఆ చీరలన్ని దోచి దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబార మేగినాడే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
ఆ ఆ నీలమై నిఖిలమై కాలమై నిలిచినాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు గోవిందుడే

No comments:

Post a Comment