Monday 27 February 2017

Emaindi E Vela - Aaduvari Matalaku Ardaale Verule

రచయిత - కులశేఖర్
చిత్రం - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే


ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెల వెల వెల బోయెనే
తన సొగసే తీగ లాగా నా మనసే లాగెనే
అది మొదలూ ఆమెవైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయెనేలా

ఆమె అందమే చూస్తే మరి లెదులేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింతా
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా
మొదటి సారీ మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా

No comments:

Post a Comment