Saturday 11 February 2017

Naada Vinodamu - Sagara Sangamam

రచయిత - వేటూరి
చిత్రం - సాగర సంగమం


వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
పార్వతీప రమేశ్వరౌ

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో ఆ భంగిమలో ఆ గానములో ఆ గమకములో ఆ
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగీకమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయవేదము సభకనువాదము సలుపు పరమ పదము ఆ ఆ ఆ
నీనిమదనీని మదనిసనీ రిసనిదనీ మగమదాద గమామ రిగస

కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం
దని సరి సనిస
జతియుత గమనం
దని సరి సనిస
నవరస నటనం జతియుత గమనం 
సుతగిరి చరణం సురనుతి పయనం
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాస్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం
నమక చమక సహజం జం
నటప్రకృతీ పాదజం జం
నర్తనమే శివకవచం చం
నటరాజ పాద సుమరజం జం
ధిర నన ధిర నన
ధిర నన
ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

3 comments:

  1. We never give comments on ever golden God gifted songs... Still for ever standard dynamical voices and compositions. Hatts off all legendry artists. Spb devotee. Nagabushanam. Hosur. Tamil Nadu. ��������������������

    ReplyDelete
  2. I am still wondering how could imagine such creativity

    ReplyDelete